Friday, April 28, 2017

RAJYALAKSHMI and SPB

 

V. S. Rajyalakshmi, M.Sc.

The huge fan of the music maestro SPB


Sripathi Panditaradhyula Balasubrahmanyam

Born on June 4, 1946 in Konetammapeta, Nellore, Andhra Pradesh

Left on  September 25, 2020 at Chennai


The Voice of Versatility,  Vivacity  &  Verve


September 25, 2024
This is the 4th Death Anniversary of the EVER-LIVING  LEGEND, SPB.  

        God gave him 74 years from 4.6.1946 to 25.9.2020.  Recording of his songs was started when he was 20-years-old.  Since then, 40,000 songs were recorded.  Divide the figure 40,000 by his 54 years of singing career.  So, 740 songs were recorded per year.  It means that 62 songs were recorded per month, and 2 songs per day.  Is it humanly possible ?  The SUPER-HUMAN BEING, SPB, made it possible.  Incredible merit and passionate work --  in 24 X 30 X 12 X 54  hours,  non-stop !!!  KUDOS !

(25-9-2024,.. నేడు బాలు నాలుగో వర్ధంతి )








శ్రీపతీ! నీకోచిరు గీత మాలిక !

ఏపాటలు పాడగలమో గదా! బాలూ...
నీవు పొడి మమ్మలరించిన నీరాగమాలికలు తప్ప
ఏబిరుదులు నీకందివ్వగలమోగదా బాలూ
మనసులోపల దాచిన మమతల మాలలు తప్ప-
మురిపాల అలరించు గీతమా! తలపులా!
పాటలు దరహాస చండ్రికలా!
నీవులేని ఈ పాటలు నిట్టూర్పుల సెగల పొగలు
నీవు లేని ఈ జగతి నిర్మానుష్యపు కారడవి
పాటెందుకు? పదమెందుకు?
నీవు లేక స్వర మెందుకు?
భాషెందుకు? భావమెందుకు? నీవు లేని పాటెందుకు?
తలపెందుకు? మనసెందుకు?
నీవు లేని ఈ స్వరాభిషేకమ్ములెందుకు?
మబ్బులతో ఒకసారి మనవి చేసికొందును -
నీ సంగీత మాలికలే జగతిపై శ్రావణమేఘాలై కురియాలనీ
చుక్కలతో ఒకసారి వినతి చేసికొందును -
నీపాటలే చుక్కలై నింగిలో మెరిసిపోవాలనీ!
దివిని వెలసిన గాన గంధర్వులను వేడుకుందును ఇలా!
మాగాన గంధర్వుడి పాటలే
జగతిలోసజీవమ్ముగా నిలిచిపోవాలనీ!
ఆ స్వరరాగ సరస్వతి ముందు చేతులెత్తి ప్రార్థింతును తుదిసారిగా
ఆస్వరరాగమూర్తియే తిరిగిరావాలనీ!
దివికేగిన 'బాలుడే' మరల జన్మించాలనీ!

V.S. రాజ్యలక్ష్మి  ( V. S. Rajyalakshmi )
పెరుందురై- ( Perundurai )
Ph: 9190549420

25-09-2023  ( the day of the 3rd Death Anniversary of SPB )

****************

Not a day passes for Rajyalakshmi without enjoying a video of a musical concert of SPB.

            She is such a lover of music that she
 sold her only gold chain, while studying M.Sc. in Visakhapatnam, in 1965,  to buy a radiogram which is still with her, half-a-century later.  The photo of the radiogram is below, and the "Love Story" about this radiogram is in the  links below :  


 

Long ago, we sang the dirge of these outdated big-sized gadgets. The youngsters of today would not have seen those disks and gadgets since they are relics of the past. 




An  EDITORIAL  in  TNIE











            The newspaper report above gives a brief information about SPB.  Detailed documentation will be in the form of books, audios and videos.  

            We are very unhappy with the loss of the iconic music giant.  We are equally unhappy with the "Modern Medicine" which could not save him.  Nine months on, we are still groping in the dark corridors of COVID-19 treatment protocols.  It is unfortunate that SPB got this at this point of time when there is no sure and safe way of treatment. He was in the hands of the high-tech medicine right from the very beginning of the mild symptoms.  He walked into the hospital almost as a normal person.  He said he was feeling fine and that the doctors advised him to take rest and medicines at home.  In his video clip, he said he was getting admitted into the hospital just to be away from callers, to ensure rest and safety from infection.  Then 52 days passed by,  but couldn't come out alive.  The doctors said that the singer 'remained pleasant, patient and determined through his 52 days of hospitalisation'. Read the following report:  --  T. Rama Prasad


            Tears dripped down when Rajyalakshmi heard the sad news.  She never saw him in real life.  That's the attachment that SPB had cemented himself to music lovers all over the world.  That's the influence of fine arts which overrides many other merits.  For example, the internationally eminent nuclear scientist and the former chairman of Atomic Energy Commission, Sekhar Babu died of COVID-19 more or less at the same time when SPB departed.  For most of the people it is just a passing news.  It didn't evoke a huge emotional response outside his circle of kith and kin.


This demonstrates the connectivity between mind and music.  Music is DIVINE.  SPB is DIVINE.  Eternal.  Immortal.  Immortalised by the world record of his voice box -- 40,000 and more of songs which would be at the click of a finger for ever,  thanks to the digital technology.
                                       --  T. Rama Prasad




Some of the POEMS written on the music maestro

Hereunder is one of the poems of Mrs. V. S. Rajyalakshmi, M.Sc., Perundurai on the legendary BALU which is published on 27.09.2022 in the "Metro Udayam Telugu Daily" newspaper.

















See below:  an ingeniously designed picture of SPB made up of letters (Telugu) of the titles of his songs !  Magnify and read.



சென்னையில் தீவிர சிகிச்சைப் பிரிவில் தன் உடலில் பல இடங்களில் பலதரப்பட்ட கருவிகள் பொருத்தப்பட்டுஉறக்கத்தில் இருந்தார் எஸ்பிபிதிடீரென்று முழிப்புத் தட்டியதுதன்னைப் பற்றியும் தற்போதைய நிலைமையைப்பற்றியும் உடனே தெளிவடைந்தார்அந்த சமயத்தில் அவரெதிரே மிகுந்த பிரகாசமான ஓர் உருவம் தோன்றியதுவந்திருப்பது அந்த இறைவனே என்பதை அறிந்தார்கை கூப்பினார்ஒரு சில நிமிடங்கள் அமைதியாகக் கரைந்தன.

 

மகனே என்னிடம் ஏதாவது பேசத் தோன்றவில்லையா உனக்கு?”

 

இல்லை என்று தலையசைத்தார் எஸ்பிபி

 

எனக்கு ஏன் இந்த நிலைமை என்று கேட்பாயோ?” 

 

இல்லை என்று மீண்டும் தலையசைத்தார். “எனக்கு மட்டும் இந்த அளவு குரல்வளம் தந்தாய்கோடிக்கணக்கானரசிகர்களைத் தந்தாய்பலபேரின் வாழ்க்கையில் மாற்றத்தை உணரவைக்கும் திறமையைத் தந்தாய்இதெல்லாம்எனக்கு மட்டும் ஏன் என்று நான் கேட்டேனாஅதுபோலத்தான் இதையும் நான் ஏற்றுக் கொண்டிருக்கிறேன்ஏதோஎன் வினைப்பயன் கழிந்து கொண்டிருப்பதாக நினைத்துக் கொள்கிறேன்

 

இறைவன் முகத்தில் புன்னகை. “உன்னை ஏன் எல்லோருக்கும் பிடித்திருக்கிறது தெரியுமா?” 

 

என் பாடல்கள்அதனை அவ்வளவு அருமையாக வடிவமைத்துக் கொடுத்த இசையமைப்பாளர்களுக்கும்பாடலாசிரியர்களுக்கும் மிக்க நன்றி

 

பாடல்கள் மட்டுமா?” 

 

வேறு என்ன என்பதுபோல் பார்த்தார் எஸ்பிபி.

 

நீ உண்மையான மனிதத்துவம் அறிந்த மனிதன்எந்த ஒரு சிறிய ஆத்மாவையும் மதிப்பவன்

 

இரு கைகளையும் கூப்பினார் பாலு

 

புகழின் உச்சியை அடைந்தாலும் அது உன் தலைக்கேறாது பார்த்துக்கொண்டாய்உன் நெருங்கிய நண்பன்உன்னைக் காயப்படுத்திய போதும்அடுத்த மேடையிலேயே அவனைப் போற்றியவன் நீபெரியவர்களை மதிப்பதிலும்இளையவர்களை ஊக்குவிப்பதிலும் உனக்கு நிகரில்லை

 

மீண்டும் இரு கைகளையும் கூப்பினார் பாலு

 

அதனால்தான் எல்லோரும் தங்களில் உன்னைப் பார்க்கிறார்கள் உன்னில் தங்களைப் பார்க்கிறார்கள்

 

போதும் பெருமானேஇதுவெல்லாம் நீ கொடுத்ததன்றோ?” 

 

அப்படிச் சொல்லிவிட முடியாதுநீ வளர்த்துக் கொண்டதுபலபேர் பாலுவைப்போல் ஆகவேண்டும் என்று கனவுகாண்கிறார்கள்எல்லோரும் உன்னைப்போல் பாடி விட முடியுமா என்னஆனால் எல்லோரும் உன் மனிதகுணங்களைப் பேண முடியும்

 

அந்த வகையில் என் ரசிகர்கள் மனதில் நான் ஒரு சிறு மாற்றத்தைக் கொண்டு வந்திருக்கிறேன் என்றால் எனக்குமகிழ்ச்சியேஐயனேஇன்று நீங்கள் வந்திருக்கும் நோக்கம்?”

 

உன் முடிவைத் தீர்மானிக்கும் அதிகாரத்தை உனக்கு அளிக்கவே இங்கு வந்திருக்கிறேன்

 

புரியவில்லையே…”

 

இப்பொழுது உன் உடலும் மனமும் எப்படி இருக்கின்றன?” 

 

மனம் அதே போல் தான்உடல்தான் சுகமில்லைஇதோ இத்தனை கருவிகள் மூலமாக என் உயிர்ஓடிக்கொண்டிருகிறதுமுன்னை விடத் தேறி வருவதாக மருத்துவர்கள் கூறியிருக்கிறார்கள்

 

இறைவன் புன்னகை மாறாமல் கேட்டுக்கொண்டிருந்தார்எஸ்பிபி தொடரட்டும் என்று காத்திருந்தார்

 

ஒரு சந்தேகம் கேட்கலாமா?” 

 

கேட்பாயாக

 

என் தொண்டையில் துளையிட்டு சுவாசக்கருவி பொருத்தி இருக்கிறார்கள்நாளை நான் குணமடைந்த பின் மீண்டும்முன்புபோல் பாட இயலுமா?” 

 

சில மாதங்கள் கழித்து நன்றாகப்பேச முடியும்உன் நுரையீரல் மிகவும் பாதிப்படைந்துள்ளதுமுன்புபோல் பாடஇயலாது என்பதுதான் உண்மை

 

இதைக் கேட்டவுடன் பாலுவின் கண்களில் தாரைதாரையாக்க் கண்ணீர் வழிந்ததுஅதை எதிர்பார்த்து இறைவன்அமைதி காத்து இருந்தான்தன்னை ஆசுவாசப்படுத்திக் கொண்ட பாலு பின்னர் கேட்டார், “எனக்கு நுரையீரல் மாற்றுஅறுவை சிகிச்சை செய்வதற்கு ஏற்பாடு செய்கிறார்கள்அது செய்து முடிந்தால் நான் பாட முடியுமா?” 

 

அப்பொழுதும் சந்தேகமேஅந்த நுரையீரலைக் காப்பாற்றும் பொருட்டு நிறைய மருந்துகளை உட்கொள்ள வேண்டிவரும்சாதாரணமாக வெளியில் சென்றுவரக் கட்டுப்பாடுகள் இருக்கும்

 

அப்படியானால் நான் முன்புபோல வானம்பாடியாக வாழ முடியாதா?”

 

என்னை மன்னித்துகொள் மகனே

 

மீண்டும் பாலுவின் கண்களில் கண்ணீர்

 

முடிவு உன் கையில்இருக்க விருப்பமாஇறக்க விருப்பமா?”

 

என்னால் பாட முடியாது என்றால் உயிர் வாழ்வதில் அர்த்தமில்லைஎன்னை இப்பொழுதே அழைத்துக் கொள்

 

இறைவனின் முகத்தில் அதே புன்னகை. “நன்றாக மீண்டுமொருமுறை யோசித்துக் கொள்

 

இதில் யோசிப்பதற்கு ஒன்றுமில்லைநான் தயார்

 

மீண்டும் பாலுவின் கண்கள் கண்ணீர் சிந்தின

 

இப்பொழுது எதை நினைத்து அழுகிறாய் மகனே?” 

 

என்னுடைய கோடிக்கணக்கான ரசிகர்கள்நான் இறந்துவிட்டேன் என்று அறிந்தால் அதிர்ச்சியடைவார்கள்அந்தவகையில் நான் அவர்களுக்குத் துன்பம் தருகிறேன்அதை நினைத்தால்.” 

 

நீ  திடீரென்று அகால மரணம் அடைந்திருந்தால் பலரும் அதிர்ச்சியில் உயிர் விட்டிருப்பார்கள்அவர்கள் மனதையும்தயார் படுத்தும் பொருட்டுத்தான் கடந்த 40 நாட்களாக நாடகம் நடந்ததுமுடிவை யாரும் எளிதாக ஏற்றுக் கொள்ளமாட்டார்கள் என்பது உண்மைஆனால் ஓரளவு பக்குவப்பட்டு விட்டார்கள்உன் பூத உடல் தான் இல்லாதிருக்கும்.இசையாக நீ நெஞ்சில் என்றும் நிறைந்து இருப்பாய்தமிழ் உள்ளவரை உன் புகழ் இருக்கும்  

 

கண்ணீர் மல்க மீண்டும் கை கூப்பினார் பாலு. “பல்வேறு இடங்களில்பலதரப்பட்ட மனிதர்களின் முன் நான்பாடியிருக்கிறேன்இப்பொழுது உங்கள் முன் பாடும் வாய்ப்பை வேண்டுகிறேன் இறைவா

 

ஆரம்பிக்கலாம் மகனே உன் இசையை

 

கண்கள் மூடி மனம் உருகிப் பாடத் தொடங்கியது அந்தக் குயில்அதை அணைத்தவாறுஅதனை அழைத்துகொண்டுஅதன் இசையில் மயங்கியவாறே பயணிக்க ஆரம்பித்தான் இறைவன்சன்னமாக வெகுநேரம் அந்தப் பாட்டுகேட்டுக்கொண்டேயிருந்தது.

 

இந்தத் தேகம் மறைந்தாலும் இசையாய் மலர்வேன்…………’


ఇంద్రుడు శుక్రవారం  స్వర్గంలో అత్యవసర  సమావేశం ఏర్పాటు చేశారు...  ఊహించని అతిధి వస్తున్నారని... అలసిపోయిన గొంతుకు.. ఇక్కడ  అమృతo  ఇచ్చి,  ఆహ్లాద  పరచాలని,  భూమండలం మీద బంధాలను తెంచుకొని వస్తున్న విశిష్ట అతిథి కి   గౌరవ సూచకంగా  గానా బజానా ఏర్పాటు చేయాలని  ఇంద్రుడు  సహచరులకు ఆదేశాలు జారీ చేశారు... ఎవర్రా..  విశిష్టఅతిధి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు...  కరెక్ట్  గా 1   గంట 4  నిమిషాలకు  పుష్పక విమానంఇంద్రలోకం వచ్చిందిఅందులో నుంచి   వ్యక్తి మైకుపుస్తకం చేతపట్టుకొని కిందకు దిగడం కనిపించింది.. తెలుగుదనం ఉట్టి పడేలా  ఎప్పుడునిండుగా కనిపించే  వ్యక్తి 40 రోజులుగా ఆసుపత్రిలో బక్కచిక్కి పోవడంతో చాలామంది పోల్చుకోలేక పోయా రూ.  అయితేఅప్పటికే సభలో ఉన్న  మ్యూజిక్ డైరెక్టర్  లు  సుసర్ల దక్షిణామూర్తిపెండ్యాల నాగేశ్వరరావుసాలూరు రాజేశ్వరరావుగానగంధర్వుడు  ఘంటసాలగేయ రచయితలుఆరుద్రఆత్రేయశ్రీ శ్రీవేటూరి వంటి వారు   ఎస్పీ బాలసుబ్రమణ్యం ను  గుర్తుపట్టారూఆప్యాయంగా పలకరించి  50 ఏళ్లు  నాటి గతాల ను  గుర్తు చేసుకున్నారు.  మమ్మల్ని కలవడానికి ఇన్నాళ్లకు  నీకు తీరికఅయ్యిందాఅంటూ  ఆట పట్టించారుఇది  ఇలా ఉండగాసభలో తెలుగు మాటలు వినబడడం తో.  సేదతీరుతున్న  ఎన్టీఆర్ఏఎన్ఆర్శోభన్ బాబుశ్రీదేవి  వంటి అందాల నటులు వచ్చారుముందుగా  ఏం బ్రదర్ ఎలా ఉన్నారుతెలుగు ప్రజలుఏమంటున్నారు,  అంటూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆలింగనం చేసుకున్నారువేటగాడు  పాటలు మళ్లీ సభలో వినిపించాయిఏంబాలసుబ్రమణ్యం ఏమయింది,  ఇలా వచ్చారు  అంటూ అక్కినేని పలకరించారు  వందనం అభివందనం నీ పాటకేఅభివందనం  సాంగ్  సభలో వినిపించిందిఅందుకు తగ్గట్లురంభఊర్వశిమేనకస్టెప్పులతో మైమరిపించారుఇది ఇలాఉండగా సభలోకి సర్దార్ పాపారాయుడు దాసరి నారాయణరావు వచ్చారుఏం బాలు గారు మీరు వచ్చారాఅక్కడ తెలుగుపాటకు రిపేర్ ఎవరు చేస్తారు అని ప్రశ్నించారుమధ్యాహ్నం మూడు గంటల  సమయంలో బాలుని కలవడానికి కేంద్రం నుంచికొంతమంది వస్తున్నారని ఇంద్రుడు కు కబురు వచ్చిందిదీంతో ద్వారపాలకులు  భద్రతను   కట్టుదిట్టం చేశారుసుమారు 5 గంటల సమయంలో   తెల్లటి  లుంగిపైజమా నా ధరించి చెయ్యి  పైకెత్తి  ఊపు కుంటూ  వ్యక్తి రావడం కనిపించింది వ్యక్తిదివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఏమండీ బాలు గారు ఎలా ఉన్నారుమా  జగన్మోహన్ రెడ్డి పథకాలు గురించి  ప్రజలుఏమనుకుంటున్నారు అని బాలు నుంచి వివరాలు తెలుసుకున్నారు.. తరువాత వైయస్  మాజీ  రాష్ట్రపతులు  అబ్దుల్ కలాం,ప్రణబ్ ముఖర్జీ , మాజీ   ప్రధానులు  ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీవాజ్పేయి లు ను  బాలుకు  పరిచయం చేశారు సందర్భంగాబాలు తాను కేంద్రం నుంచి మీ చేతుల మీదుగా ఎన్నో పురస్కారాలు  అందు  కున్నానని గతాన్ని గుర్తు చేశారు.   సందర్భంగా  బాలు తన డిక్షనరీ లో నుంచి  కొన్ని పాటలు పాడి వినిపించారు.  బాలు గొంతు  ఎన్టీఆర్ ఏఎన్ఆర్  శోభన్ బాబు  లా ఉండడంతోఇంద్రుడు తో పాటు  కొలువుదీరిన వారు ఆశ్చర్య పోయారు    ఇక సభలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్వరాభిషేకంపాడుతాతీయగా  వంటి కార్యక్రమాలు ఉంటాయని దేవేంద్రుడు  ఆదేశాలు జారీ చేశారుమొత్తం మీద బాలు మొదటిరోజు  స్వర్గ యాత్రబిజీబిజీగా  సాగింది.


The above article is written by the VICE-PRESIDENT  of  INDIA

        The volume of writings that rolled out of the press today (26.09.2020)  is a veritable testimony to the legendary eminence of SPB.  Notably,  it is the GOODNESS, humility, humbleness and empathy of this colossus that is highlighted.  A 'GOOD HUMAN BEING'  !!!  RIP.  --  trp


SPB  Vanam

    On October 15, 2020,  an environmental NGO of Coimbatore named SIRUTHULI made a beginning for  creation of "SPB Vanam" (SPB Garden) with 74 (his age) saplings of 74 varieties of sacred trees (Sthala Vrikshams) of the Hindu deities.  EACH TREE WOULD BE NAMED AFTER A POPULAR SONG SUNG BY SPB. The wood of this kind of trees was traditionally used to make musical instruments.  To be in tune with SPB's astrological star 'Ayiliam', the 'Champaka' variety of tree sapling was chosen to be the first one to be planted.






This is a statue sculpted by the famous sculptor  Raaj Kumar Wadayar of Kottapeta of East Godavari district in Andhra Pradesh.

September 25, 2024
This is the 4th Death Anniversary of the EVER-LIVING  LEGEND, SPB.  

        God gave him 74 years from 4.6.1946 to 25.9.2020.  Recording of his songs was started when he was 20-years-old.  Since then, 40,000 songs were recorded.  Divide the figure 40,000 by his 54 years of singing career.  So, 740 songs were recorded per year.  It means that 62 songs were recorded per month, and 2 songs per day.  Is it humanly possible ?  The SUPER-HUMAN BEING, SPB, made it possible.  Incredible merit and passionate work --  in 24 X 30 X 12 X 54  hours,  non-stop !!!  KUDOS !

(25-9-2024,.. నేడు బాలు నాలుగో వర్ధంతి )




PUBLISHED in 

 of September 25, 2024



బాలూ. తెలుసా, నీ విలువా ?  
నీ పెదవులు పలుకగపోతే  “ పాడుతా తీయగా” లేదుగా ! 
నీ స్వరమే సుప్రభాతము పాడకపోతే జగమే తెలవారదుగా ! 

నీ చిరునవ్వులు చిందకపోతే, పాటలోన మైమరపే లేదుగా! 

ప్రతి రాగములో హాయిగా పాడినా అమనీ కోయిలా! 

అంతులేని తేనెల మాధుర్యమా! 

అభిమానుల గాన గంధర్వమా! 

మరపురాని పాటకు ప్రతిరూపమా! 

నీవు లేని ఈ జగతిలో- పాటలే కురియునా ! 
మధువులే చిoదువా! 
లోకానికి నీ ఉనికే ఓ కలగా మారెనులే ! 

బాలు - ఎక్కడా? - నీవెక్కడా?  

బాలూ- లోకానికి తెలుసా నీవిలువా ! 

నీ పాటకు కలవా సరి హద్దులూ! 

జగమంతటికీ బాలు'పాట' ఒకటే కానీ - పాటకు 'బాలు' ఒక్కడే -

-VS Rajyalakshmi 
Perundurai, 
9790549420

సినిమా పాటకు పర్యాయపదం బాలు… చెరిగిపోని స్వర చేవ్రాలు.

బాలు మాట- పాట- బాట

పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు పాట పెదవి విప్పింది. గుండె గొంతుకలో వేదన సుడులు తిరిగితే మౌన రోదనగా పాట పుట్టింది. ఆనందం అర్ణవమైతే మనసుకు రెక్కలొచ్చి పాట పుట్టింది. పుడితే ఉయ్యాల పాటనుండి పొతే మొయ్యాల్సిన పాటదాకా బతుకంతా పాటే.

ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణాన్ని తంత్రీవాద్య సమన్వితంగా పాడుకోవడానికి వీలుగా రాసినట్లు స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు. ఎలా పాడాలో ఆశ్రమంలో మొదట లవకుశులకే నేర్పాడు. ఆ రామగీతాన్ని తొలిశ్రోతగా తానే విని పరవశించి, తృప్తిగా లవకుశుల ముఖతః లోకానికి వినిపించాడు. వచనం ఎంత గొప్పదయినా గుర్తు పెట్టుకోవడం అంత సులభం కాదు. వచనాన్ని రాగంతో పాడడం చాలా కష్టం. శ్లోకం, పద్యం, పాటలో నియతి ఉంటుంది. రాగం ఉంటుంది. యతిప్రాసలు ఉంటాయి. ఛందోలంకారాలు ఉంటాయి.

రాగం తోడయిన పదం అనురాగమై వెంటపడుతుంది. ఒక తూగులో, లయలో ఆ సాహిత్యం వచనం కంటే పదికాలాలపాటు గుర్తుంటుంది. వచనం కంటే సాంద్రమై నెమరువేతకు సులభమవుతుంది. పాట శ్లోకం, పద్యంగా పరిణమించింది. పాటంటే తెలుగులో సినిమా పాటలే అన్నంతగా వ్యాప్తి పొందింది. ఆ పాటల పూదోటలకు ఘంటసాల ఒక తోటమాలి. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మరొక తోటమాలి.

బాలు జీవితకాలం 4-5-1946 నుండి 25-9-2020 వరకు డెబ్బయ్ నాలుగేళ్లు. ఇరవై ఏళ్ల వయసులో పాడడం మొదలు పెట్టి నలభై వేల పాటలు పాడాడు. నలభై వేలను యాభైనాలుగేళ్ళతో భాగిస్తే సంవత్సరానికి ఏడు వందల నలభై పాటలు. అంటే నెలకు అరవై రెండు పాటలు. సగటున రోజుకు రెండు పాటలు పాడినట్లు. ఒక మనిషికి ఇది సాధ్యమేనా? బాలుకు మాత్రమే సాధ్యం.

అతిపరిచయం వల్ల చెప్పడానికి ఏమీ మిగిలి ఉండదు. అలా బాలసుబ్రహ్మణ్యం గురించి, ఆయన పాటల గురించి తెలియనిదెవరికి? ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏముంది? గొప్పగా పాడాడు. కష్టమయినవి పాడాడు. సులభంగా పాడాడు. సున్నితంగా పాడాడు. సంప్రదాయం ఒడిసిపట్టుకుని పాడాడు. స్పష్టంగా పాడాడు. తెలుగును తెలుగులా పలికాడు. అక్షరాన్ని మింగేయకుండా పాడాడు. ఊపిరి బిగబట్టి పాడాడు. 

దిక్కరీన్ద్ర జిత హిమగిరీన్ద్ర సిత కందరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా విని తరించరా! అన్నాడు. ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే! అన్నాడు. పారేసుకోవాలనారేసుకున్నావు..
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ.. అన్నాడు.

ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ముగిస్తే బాలు పాటల చరిత్ర పూర్తవుతుంది? తెలుగుపాట అప్పుడు ఘంటసాలను కోరుకుంది. ఆయన పోతూ పోతూ ఆ పాటను బాలు చేతిలో పెట్టి వెళ్లాడు. బాలు పోతూ పోతూ ఆ పాటను ఎవరిచేతిలో పెట్టాలో తెలియక వెళ్లిపోయాడు. అయినా పిల్లి పిల్లకు పెళ్లి చేసి, పెళ్లీడు పిల్లకు పెల్లి చేసే నేటితరం గాయకులకు, శ ష స అన్నవి దేనికవిగా విడి విడి అక్షరాలని తెలియని గాయకులకు, ఉంటే అనడానికి ఉల్టే అనే గాయకులకు, ఉండిపోరాదే అని అనలేక ఉం డిప్పోరాదే – గుండెనీదేలే, గుండె కేనన్నే … అని భాషోచ్చారణ తెలియని పరవశ గాయకులకు తెలుగు చెప్పడం హత్యానేరంతో సమానం.

పాటంటే నిజానికి ఒక పల్లవి. రెండు చరణాలే. కానీ మాటలు చెప్పలేని భావమేదో పాటలు చెప్పాలి. పాటలో ఒక్కొక్క మాట వేనవేల మాటలుగా ప్రతిధ్వనించాలి. ప్రతిపదం భావార్థంగా ప్రతిఫలించాలి. అలా బతుకంతా పాటలతో ప్రతిధ్వనించి, పాటగా ప్రతిఫలించిన బాలుగురించి మాటల్లో చెప్పడం కష్టం. ఆయన పాటలు వినడం సులభం. మనకు పాటల కర్ణామృతాన్ని పంచడానికి ఆయన ఎంత గరళం గొంతులో దాచుకున్నాడో?

“…కనులలోన.. కనుబొమలలోన… అధరమ్ములోన.. వదనమ్ములోన..
గళసీమలోన.. కటిసీమలోన.. కరయుగములోన.. పదయుగములోన…
నీ తనువులోని అణువణువులోన ..అనంత విధముల అభినయించి ఇక ఆడవే….ఆడవే.. ఆడవే…”

అని బాలు అంటే సి నా రె సృష్టించిన నాట్య మయూరే ఆడలేను…ఆడలేను…ఆడలేను…అని కాళ్లు కట్టేసుకుని కూర్చుంది. ఇక మనమెంత?
బాలు పాటలు వింటూ ఉండడం తప్ప- ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం?

కొందరు శాశ్వతంగా దూరమవుతారు. కొందరు భౌతికంగా దూరమవుతారు. పాడుతా తీయగా పాటల చర్చలతో బాలు ప్రతి ఇంటికీ వచ్చి మనతో మాట్లాడాడు. మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతూనే ఉంటాడు.
మాటే పాటైనవాడు.
పాటే బాటైనవాడు.
మనకు కర్ణామృతమైనవాడు. మనకెప్పుడూ దూరం కానివాడు.

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ.. మరులే కురిపించీ
జీవన రాగమై.. బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ?
అవును- అదే బాలు మురళి.
అవును- అదే బాలు పాటల రవళి.

రాగాలనంతాలు.. నీ వేయి రూపాలు..
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు గీతాలు
దొరకునా ఇటువంటి సేవ?
దొరకునా ఇటువంటి బాలు?

(25-9-2024,.. నేడు బాలు నాలుగో వర్ధంతి )

-పమిడికాల్వ మధుసూదన్
9989090018
-----------------------------------------------------------

--స్వర గంగా...స్వర్గంగా...బాల సమ్మోహనంగా-
------//----//-----//----//------//------//-------

 కంఠం విన్న తొలినాళ్లలో
నా మనసంతా పొంగిపోయింది
తనువంతా హరిచందనమయ్యింది

 గళం మ్రోగుతుంటే హుషారయ్యింది
కారులోన ఎక్కి జోరుగా నడిపినట్టయ్యింది
పొదరిల్లును పదిలంగా అల్లుకున్నట్లయ్యింది
ఎండవేళ గుండెలోన వాన కురిసినట్లయ్యింది

 కవిలో మెరిసిన భావగీతమో
 దివిలో విరిసిన పారిజాతమో
మన ఇంటి ముంగిట పుష్పించింది
పరీమళలాను మనకు పంచినట్లయ్యింది

 స్వరం ఘల్లుఘల్లుమంటుంటే
మన గుండె ఝల్లుఝల్లుమంటుంది
 గొంతు ఖంగు ఖంగుమంటుంటే
మన గుండె అనుభూతుల వెల్లువవుతుంది

 కంధరం రాగం తానం పల్లవందుకుంటే
మన ఎద ఆనందభైరవి రాగమవుతుంది
మన నరాల సవ్వడి  పాటకు తాళమేస్తుంది
చిటపట చినుకులలో తడిపొడి మేళమౌతుంది

బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటూ
 గొంతెత్తితే మది కార్తికాభిషేకమౌతుంది
కదిలింది కరుణ రథమంటుంటూ సాగుతుంది
అల్లాయే దిగివచ్చి ఏమి కావాలనడిగినట్లుంటుంది

 గళం రాగాల సిగలోన సిరిమల్లి
'
దశకంఠ'సంభాషణా గగనాన జాబిల్లి
మన వాకిట ముత్యాల పందిరిలేసింది
తియతీయని మురిపాల ముద్దరలేసింది

 గాత్రం పాడుతుంటే మాటలాడుతుంటే
నటనా సామర్ధ్యంతో ఆటలాడుకుంటుంటే
భావితరాల స్వరాలకు సానపడుతుంటే
లొతైన వ్యాఖ్యలతో లోపాలు సరిదిద్దుతుంటే

నిండైన హృదయాలతో స్వామిని వేడుకుంటున్నాం
వేవేల కాలాలు  మూర్తి నిలవాలని
ఆయన సాహచర్యం మాకు కావాలని
 అదృష్టాన్ని మా తరతరాలకు ప్రసాదించమని

 గళం గాంధర్వం  కంఠం మాధుర్యం
 గాత్రం లాలిత్యం  గొంతు నవనీతం
అది అవనీతలాన వెలసిన స్వరపారిజాతం
 మకరందం పేరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఇది రెడ్డప్ప ధవేజి మది పలికిన వాక్కుసుమం
వాక్కైతే నాదే కానీ ఇది కోటానుకోట్ల ప్రజాభిప్రాయం
దేశదేశాల యువతరాల స్వరాల అంతరంగం
కలకాలం చల్లగా సాగే స్వర గంగా ప్రవాహం
---
చక్రావధానుల రెడ్డప్ప ధవేజి
నరసాపురం
 కవిత సరిగ్గా నాలుగేళ్ళ క్రితం వ్రాసి బాలు గారికి ఇచ్చాను.

September, 2024

 

 


2 comments:

  1. Super article sir.A very special Tribute to SPB Sir.

    ReplyDelete
  2. SPB: THE GREAT LEGEND LEFT US IN AGONY WHEN HE LEFT THE WORLD .SPB IS THE UN ENTERED NAME IN EVERY FAMILY RATION CARD.

    ReplyDelete